తృణమూల్‌ది అసత్య ప్రచారం
04-08-2018 02:56:29
పారదర్శకంగా ఎన్‌ఆర్‌సీ రూపకల్పన: రాజ్‌నాథ్.. నేడు, రేపు బెంగాల్‌లో బ్లాక్‌డే: తృణమూల్
న్యూఢిల్లీ, ఆగస్టు 3: జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)పై తృణమూల్ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారానికి పాల్పడుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీ రూపకల్పనలో ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపలేదన్నారు. శుక్రవారం రాజ్యసభలో అసోం ఎన్‌ఆర్‌సీ ముసాయిదాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా, లోక్‌సభలోనూ రాజ్‌నాథ్ మాట్లాడారు. ఏ ఒక్క భారతీయుణ్నీ ఎన్‌ఆర్‌సీ నుంచి తొలగించలేదని, మొత్తం ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. జాతీయ భద్రతతో కూడిన ఈ అంశానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
కాగా పలువురు తృణమూల్ నేతలు గురువారం అసోం పర్యటనకు వెళ్లడం, వారిని అక్కడి పోలీసులు సిల్చార్ విమానాశ్రయంలో అడ్డుకోవడంతో రాత్రంతా వారు విమానాశ్రయంలోనే ఉండిపోవడం తెలిసిందే. అయితే అసోం అధికారులు తమ ప్రజాప్రతినిధులపై చేయి చేసుకున్నారని, అక్కడి పరిస్థితి చూస్తుంటే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. దీనిపై రాజ్‌నాథ్ లోక్‌సభలో మాట్లాడుతూ.. అసోంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్న సమాచారం ఉండటంతో తృణమూల్ ఎంపీలను విమానాశ్రయంలో నిలిపివేశారని తెలిపారు. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదని, ఆ రాష్ట్ర అధికారులు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.
కశ్మీరీ పండిట్లను రప్పించగలరా?: శివసేన
అసోం ఎన్‌ఆర్‌సీపై మోదీ సర్కారుకు శివసేన మద్దతు ప్రకటించింది. అయితే కశ్మీర్‌ను వీడివెళ్లిన పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు ఇదే ధైర్యాన్ని ప్రదర్శించగలరా? అని ప్రశ్నించింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే వారినందరినీ పంపించివేయాల్సిందేనని, వారితోపాటు కశ్మీర్‌లోని చొరబాటుదారులనూ వెళ్లగొట్టాలని తమ అధికార పత్రిక సామ్నాలో శివసేన పేర్కొంది. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చేవారందరూ ఉండేందుకు భారత్ ధర్మసత్రం కాదని ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. వారందరినీ వెళ్లగొట్టాల్సిందేనని పేర్కొన్నారు.

No comments:
Post a Comment