'ట్రిపుల్ తలాఖ్' బిల్లుకు ఆమోదం
ఓవైసీ సవరణలకు నో.. ట్రిపుల్ తలాక్‌కు ఆమోదం
Dec 28, 2017, 20:18 IST
Triple Talaq Bill Passed In Lok Sabha - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఒక్క సవరణ లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలతోపాటు ఇతరులు ప్రతిపాదించిన సవరణలకు కూడా మద్దతు లభించకపోవడంతో అవి వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభలోకి అడుగుపెట్టనుంది. గురువారం లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు తాను వ్యతిరేకం అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన ప్రసంగిస్తూ పలు సవరణలు ప్రతిపాదించారు.
ముస్లింలను సంప్రదించకుండానే బిల్లును తీసుకొచ్చారన్న ఆయన ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనితో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని, ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త జైలుకు వెళితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని అసదుద్దీన్ ప్రశ్నించారు. కాగా, అంతకుముందు మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ నేడు చారిత్రాత్మక దినం అన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదని, ముస్లిం మహిళలకు పెద్ద ఊరట అని, లింగ సమానత్వం కూడా ఈ బిల్లు ద్వారా అందుతుందని చెప్పారు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు ఎంతో సహాయం చేస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలను ఈ బిల్లుతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మరోపక్క, ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, ఎంఐఎం, బిజు జనతాదల్ వంటి పార్టీలు మాత్రమే ఈ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకం అని అన్నారు. అలాగే, ముస్లి పర్సనల్ లా బోర్డు కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఏదీ ఏమైనా మొత్తానికి ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించాయి.
ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఒవైసీ అడ్డుపుల్ల
Dec 28, 2017, 11:59 IST
Owaisi has given a notice to oppose Triple Talaq Amendment Bill - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లు నేడు లోక్‌సభ ముందుకు రానుంది. అయితే ఇది విరుద్ధమంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉదయం ఓ నోటీసును అందించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 72వ నిబంధన ప్రకారం నోటీసు అందజేసినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే దానిపై చర్చకు అంగీకరిస్తారా? అన్నది చూడాలి. ‘‘ముస్లిం మహిళలను రక్షించేందుకు రూపొందించిన బిల్లు అని కేంద్రం చెబుతోంది. తద్వారా ముస్లింలను దోషిగా చూపించి రెచ్చగొట్టే విధంగా కేంద్రం చేష్టలు ఉన్నాయని స్పష్టమౌతోంది’’ అని ఆయన చెబుతున్నారు.
కావాలంటే ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డుతో సంప్రదించి, వారి సూచనల ప్రకారం చట్టాన్ని రూపొందించాలని అసదుద్దీన్ గతంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు.
ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు నేపథ్యంలో లోక్‌సభకు ఇవాళ, రేపు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయ్యింది. ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లు-2017కు హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. ఇంకోపక్క బిల్లును రూపొందించడంలో సరైన పద్ధతిని అవలంబించలేదని కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి
తక్షణ తలాక్ నేరం
29-12-2017 02:58:09
వెంటవెంటనే చెబితే మూడేళ్ల జైలు
చరిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మద్దతు ఇస్తూనే... కాంగ్రెస్ ‘సవరణ’ స్వరం
స్థాయీ సంఘానికి పంపాలని సూచన
బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్
ఆర్జేడీ, బీజేడీ, అన్నా డీఎంకేదీ అదేబాట
3 సవరణలను ప్రతిపాదించిన ఒవైసీ
241-2 తేడాతో వీగిపోయిన సవరణలు
నేడు రాజ్యసభ ముందుకు రానున్న బిల్లు
ఎగువసభలో ఆమోదంపై ‘ఉత్కంఠ’
ఇది మత అంశం కానే కాదు: రవిశంకర్
ఏకాభిప్రాయంతో ఆమోదించండి: మోదీ
దేశంలో 9 కోట్ల మంది ముస్లిం మహిళలున్నారు. భర్త తమకు ఎప్పుడు తలాక్ చెబుతారో అని వారిక ఎంత మాత్రం భయపడాల్సిన పనిలేదు.
కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్
మోదీ వంటి సోదరుడు ఉండగా ముస్లిం మహిళలు ఇక ఎంత మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు.
బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి
న్యూఢిల్లీ, డిసెంబరు 28: తలాక్... తలాక్... తలాక్! మూడు క్షణాల్లో ‘తక్షణ’ విడాకులు! ఇది చెల్లనే చెల్లదు... అని లోక్‌సభ తేల్చేసింది. ఇలా చెప్పడం శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. చరిత్రాత్మకమైన ‘తక్షణ తలాక్’ బిల్లుపై గురువారం దిగువ సభ ఆమోద ముద్ర వేసింది. ఇక... రాజ్యసభలోనూ అది గట్టెక్కితే... ‘తక్షణ తలాక్’ నేరం! అలా చెప్పిన వారికి మూడేళ్లు కారాగారం! ‘ముస్లిం మహిళల తలాక్ కష్టాలకు చెల్లుచీటీ పలుకుతున్నాం’ అంటూ బీజేపీ నేతలు సగర్వంగా ప్రకటిస్తూ... బల్లలు చరుస్తూ బిల్లుకు ఆమోదం పలికారు. ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’గా పేర్కొంటున్న ‘తక్షణ తలాక్’ వ్యతిరేక బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం సభ ముందు ఉంచారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ బిల్లును వ్యతిరేకించారు. 3 సవరణలను సభ 241-2 ఓట్ల తేడాతో తిరస్కరించింది. బిల్లును యథాతథంగా ఆమోదించింది. దీన్ని శుక్రవారం రాజ్యసభకు పంపుతారు. ఒకేసారి ముమ్మారు తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించింది. 6 నెలల్లోగా చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని సూచించింది. ఈ మేరకు కేంద్రం కసరత్తు చేసి బిల్లు తీసుకొచ్చింది.
సాధికారత దిశగా గొప్ప అడుగు
‘‘మహిళల సాధికారత దిశగా గొప్ప ముందడుగు పడింది. మహిళల గౌరవాన్ని, హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. ఈ బిల్లు ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించింది కాదు. మహిళలకు రక్షణ కల్పించి.. వారికి న్యాయం చేయడమే మా లక్ష్యం’’ అని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇది చరిత్రాత్మకమైన రోజుగా ఆయన అభివర్ణించారు. ‘‘ఆలస్యంగా నిద్రలేచిందంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఒక మహిళకు ఆమె భర్త అప్పటికప్పుడు తలాక్ చెప్పేశాడు. మహిళల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నా కొందరు ఎంపీలు మౌనం పాటించడం సబబేనా? ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులే నిర్ణయించాలి’’ అని ఆవేశంగా ప్రసంగించారు.
తక్షణ తలాక్‌ను పాకిస్థాన్, బంగ్లాదేశ్, మొరాకో, ఇండోనేషియా, మలేషియా, ట్యునీషియా వంటి ఇస్లామిక్ దేశాలే నిషేధించాయని తెలిపారు. అదే మార్గంలో భారత్ పయనించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడొద్దని సభ్యులను కోరారు. ‘‘తక్షణ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించిన తర్వాత ఈ కేసులు తగ్గుముఖం పడతాయనుకున్నాం. కానీ... తర్వాత కూడా 100 కేసులు నమోదయ్యాయి. మేం ముస్లింల షరియాలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. కేవలం తలాక్-ఏ-బిద్ధత్ గురించి మాత్రమే బిల్లులో ప్రస్తావించాం’’ అని వివరించారు. బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తుందని లోక్‌సభలో కాంగ్రె్‌సపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అయితే బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని పార్లమెంటు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసి సరిదిద్దాలన్నారు.
కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ మాట్లాడుతూ.. తక్షణ తలాక్ చెప్పిన భర్త మూడేళ్లపాటు జైలులో ఉంటే బాధిత మహిళకు జీవనభృతిని చెల్లించేందుకు కేంద్రం ఏమైనా కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించినా ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. ‘తక్షణ తలాక్ చెప్పాడంటూ భర్తను జైలుకు పంపితే, అతని కుటుంబ సంరక్షణ బాధ్యత ఎవరు చూసుకుంటారు. ఇలాంటి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలపదు’ అన్నారు.
ఒక్కతాటిపైకి రండి!
విపక్షాలకు మోదీ పిలుపు
లోక్‌సభలో బిల్లు ఎన్డీయేకు భారీ మెజారిటీ ఉంది. రాజ్యసభలో మాత్రం ఎన్డీయే బలం తక్కువ! వెరసి... శుక్రవారం ఎగువ సభలో తక్షణ తలాక్ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తక్షణ తలాక్ బిల్లుపై అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లును రాజ్యసభలో ఆమోదింప చేసుకునేందుకు విపక్షాలతో చర్చలు జరిపి, ఏకాభిప్రాయాన్ని సాధించాలని పార్టీ నేతలకు ప్రధాని సూచించారని కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు. మరోవైపు... ఈ బిల్లుకు రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాజ్యసభలో బిల్లును సవరించాలని కోరితే, సమీక్ష కోసం దాన్ని పార్లమెంటరీ కమిటీకి పంపాల్సి ఉంటుంది. వెరసి... శీతాకాల సమావేశాల్లో తక్షణ తలాక్ బిల్లు ఆమోదం పొందడం అనుమానమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
విపక్షాల వ్యతిరేకగళం
తక్షణ తలాక్ బిల్లును ఏఐఎంఐఎంతోసహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ముస్లిం లీగ్ ఎంపీ మహ్మద్ బషీర్ మాట్లాడుతూ.. ‘ముస్లిం పర్సనల్ లా’ను ఉల్లంఘించేలా బిల్లును రూపొందించారని, బిల్లు రూపకల్పనలో రాజకీయ లబ్ధికి పెద్దపీట వేశారని అన్నారు. ఎంఐఎంతోపాటు ఆర్జేడీ, బీజేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అన్నాడీఎంకే ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. బిల్లును ఏకపక్షంగా.. తప్పులతడకగా రూపొందించారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా బిల్లును వ్యతిరేకించారు. గతంలో ముసాయిదా బిల్లును వ్యతిరేకించిన తృణమూల్ గురువారం మాత్రం సభలో మౌనం పాటించింది.