న్యాయం - Wahed
గత కొంతకాలంగా నోయిడా, ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది వర్గపోరాటమే. నోయిడాలోని పోష్ కాలనీలో డబ్బుకు కొదువలేని సంపన్న వర్గాలకు, రోజుకూలి చేసుకునే జొహ్రాకాలనీ వాసులకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో సహజంగానే ప్రభుత్వము, మంత్రులు, పోలీసు, పాలనాయంత్రాంగాలన్నీ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ నిలబడ్డాయి. మాహాగన్ మోడర్నే పేరుతో ఉన్న ఈ పోష్ కాలనీ గేటెడ్ కమ్యునిటీ. ఇక్కడ ఇండ్లలో పాచి పని చేసే జొహ్రాబీ కనబడకుండా పోయింది. ఈ కాలనీకి పక్కనే ఉన్న మురికివాడలో నివసించే జొహ్రాబీ ఈ కాలనీలో సేఠీ కుటుంబం వద్ద పనిచేసేది. ఆమె భర్త ఆమెను వెదుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడి సెక్యురిటీగార్డులు అడ్డుకున్నారు. మురికివాడ నివాసులు ఆమె ఎక్కడుందో చెప్పాలంటూ నిరసనగా వచ్చారు. చివరకు ఆమె ఎక్కడున్నదో తెలిసింది.
రెండు నెలల జీతం ఇమ్మని అడిగిన పాపానికి ఆమెను నిర్బంధించారని జొహ్రాబీ చెప్పింది. మరోవైపు ఆమెను నిర్బంధించిన సేఠీ కుటుంబం కూడా మురికివాడ వాసులపై కేసు పెట్టారు. అయితే కేంద్రమంత్రి మహేష్ శర్మకు రెండు పక్షాల వాదనలు వినేంత తీరిక లేదు. సహజంగానే పేదల బాధలు వినే తీరిక పాలకులకు ఉండదు. ఏకపక్షంగా సేఠీ కుటుంబం అమాయకులనీ, వారికి ఎలాంటి పాపం తెలియదని ప్రకటించాడు. పోలీసులు కొంతమంది మురికివాడ వాసులను, ఇండ్లల్లో పనిచేసేవారిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి అస్సలు బెయిలు కూడా దొరక్కుండా చేస్తానని బెదిరించాడు. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్టు చేసినవారిపై హత్యాప్రయత్నం కేసులు కూడా పెట్టేసి రాజకీయ నేతలకు సంతోషం కలిగించారు. ఈ పోష్ కాలనీలోని అమాయక సంపన్నుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు లేవు. వారిపై భౌతిక దాడులు జరిగినట్లు ఎఫ్ ఐ ఆర్ లలో ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. మరి హత్యాయత్నం కేసులు ఎలా ఫైలయ్యాయి?
స్పష్టంగా కనబడుతున్న విషయమేమంటే, మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన. ఒకవైపు జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యంత సంపన్నులు, మరోవైపు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన నిరుపేదలు. ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది. ఈ నిరుపేదలంతా బెంగాలు నుంచి వలస వచ్చిన ముస్లిములు. కాబట్టి దీనికి మతంరంగు పులమడం కూడా వెంటనే జరిగిపోయింది. వాట్సప్, ఫేస్ బుక్కుల ద్వారా అబద్దాలు, ఫేక్ వార్తలు ప్రచారం చేయడంలో సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించే ఈ సోకాల్డ్ చదువుకున్నవాళ్ళు వెంటనే మురికివాడ వాసులను బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులుగా కూడా ప్రచారం మొదలుపెట్టారు. అది అబద్దమని, ఈ పేదలంతా బెంగాలుకు చెందిన వారన్నది రుజువైన సత్యం. కాని అబద్దాలు చెప్పేవారికి సిగ్గెగ్గులు ఉండవు. ఈ అబద్దాన్ని ప్రచారంలో పెట్టడమే కాదు, మరో మాల్దా అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఈ సంఘటన మన నగరాల్లో వర్గవిభజన ఎలాంటిదో చాటి చెప్పే సంఘటన. ధనికులకు, పేదలకు మధ్య ఘర్షణలో యావత్తు రాజ్యం ధనికులకు వత్తాసు పలుకుతుందని చాటి చెప్పిన సంఘటన. ఈ సంఘటనలో యాధృచ్ఛికంగా పేదలు బెంగాలు నుంచి వచ్చిన ముస్లిములు కాబట్టి వారిని బంగ్లాదేశీలుగా ముద్రవేయడం జరిగింది. అలా కాకుండా ఈ పేదలు దళితులు లేదా మరో బలహీనవర్గానికి చెందినవారైతే మరో ముద్ర వేసి వేధించేవారు. అసంఘటితరంగంలో పనిచేస్తున్న ఈ మురికివాడల పేదల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని దేశంలోని సంపన్న వర్గాలకు ఈ వివక్షలు, దౌర్జన్యాలు తమ హక్కుగా కనబడతాయి. కాని మహేష్ శర్మ వంటి మంత్రులు ’’చాలా మంది ఇండ్లల్లో పనిమనిషికి పెళ్ళాం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది‘‘ అంటూ అసభ్యంగా, అశ్లీలంగా జోకులేస్తారు. ఈ సంపన్న వర్గాలే అన్నది మన ప్రజాస్వామ్యం అసలు రూపం అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే వాస్తవం.

No comments:
Post a Comment