మొసలి కన్నీళ్ళతో మభ్యపెట్టలేరు
- వాహెద్
------------------
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ముస్లిములకు సంబంధించి రెండు ముఖ్యమైన అంశాలు చర్చల్లోకి వచ్చాయి. అందులో ఒకటి త్రిపుల్ తలాక్. రెండవది గోరక్షణ పేరుతో ముస్లిములపై హత్యాకాండ. విచిత్రమేమంటే, పాలకపక్ష నేతలు త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతూ కనబడ్డారే కాని హత్యాకాండపై నోరు విప్పింది చాలా తక్కువ. పాలకపక్షం, రాజకీయ నేతలు సరే మన మీడియా కూడా త్రిపుల్ తలాక్ పై ఉత్సాహం చూపించి, కవరేజిలో భూమ్యాకాశాలు ఏకం చేసిందే కాని ఈ హత్యాకాండ పట్ల అంత శ్రద్ధ చూపలేదు.
ఈ హత్యాకాండ ఎంత అనాగరికంగా, ఎంత అమానుషంగా జరుగుతుందంటే ఆవును చంపారన్న అనుమానం ఉంటే చాలు చంపేయడం, గొడ్డుమాంస అన్న అనుమానంతో చంపేయడం, ముస్లిములుగా కనబడితే చాలు దాడులు చేయడం ఇవన్నీ చట్టబద్దపాలన అనేది లేనేలేదని స్పష్టం చేస్తున్న సంఘటనలు. అయినా మీడియాకు ఇవి పెద్దగా పట్టలేదు. విచిత్రమేమంటే గొడ్డుమాంసం అన్న అనుమానంతో హత్యలు జరుగుతున్నాయి కాని గొడ్డుమాంసమే ఎగుమతి చేసే అల్ కబీర్ తదితర బడా బడా వ్యాపారసంస్థల వైపు ఈ గోరక్షక ముఠాలు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. జూన్ 23వ తేదీన జునైద్ ఖాన్ హత్యతో ఈ గోగ్రవాద హత్యల బీభత్సం జాతినిర్ఘాంతపోయేలా చేసింది. నాట్ ఇన్ మై నేమ్ అంటూ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టేలా చేసింది. కాని అదే సమయంలో ఘనత వహించిన ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా స్థానంలో జండర్ జస్ట్ లా తీసుకొచ్చి ముస్లిమ్ మహిళలను కాపాడ్డానికి నడుం కట్టే ప్రయత్నాలు చేస్తున్నానంది. ఒకవైపు ముస్లిములపై దాడులు హత్యాకాండ నిరాఘాటంగా జరుగుతుంటే మరోవైపు ముస్లిమ్ మహిళలను కాపాడ్డానికి ప్రభుత్వం నడుంకట్టి కొత్త చట్టం తెస్తానని చెప్పడం ఎంత హాస్యాస్పదం.
దేశంలో ముస్లిమ్ సముదాయానికి సంబంధించిన ఈ రెండు సమస్యలను మరింత లోతుగా చూడవలసిన అవసరం ఉంది.
రాజస్థాన్ బిర్లోకాలో 2015 మార్చి 31వ తేదీన 60 సంవత్సరాల వృద్ధుడు అబ్దుల్ గఫార్ ఖురైషీని గుంపులు దాడి చేసి చంపేశాయి. ఈ దాడికి ముందు ఏం జరిగిందన్నది కూడా గమనార్హం. ముస్లిములు విందుభోజనాల కోసం 200 ఆవులను చంపేశారన్న వార్తలు, ఫోటోలు వాట్సప్, ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఎన్నడూ మతకలహాలన్నది ఎరుగని బిర్లోకాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబ్దుల్ గఫార్ ఖురైషీ పొరుగున ఉండే వ్యక్తి జనాన్ని రెచ్చగొట్టాడు. జనం రెచ్చిపోయి చంపేశారు. మీడియాలో ఈ వార్తకు ప్రాముఖ్యమే లభించలేదు. ఇది మార్చి 2015లో జరిగింది. కాని ఆగష్టు 20, 2015న భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోళన్ తాము సర్వే చేశామని చెప్పుకుంటూ విడుదల చేసిన నివేదికకు మీడియా పతాక శీర్షికల ప్రాముఖ్యం ఇచ్చింది. త్రిపుల్ తలాక్, బహుభార్వత్వాలను రద్దు చేయడమే ముస్లిమ్ మహిళల సమస్యలకు పరిష్కారమని ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి ఈ సంస్థ చెప్పిన మాటలను వేదవాక్కులుగా మీడియా గౌరవించి ప్రచురించింది. భారతదేశంలో ముస్లిమ్ మహిళలందరూ త్రిపుల్ తలాక్, బహుభార్వత్వం తీవ్ర సమస్యలుగా భావిస్తున్నారని, ఈ సర్వేలో అది స్పష్టమైపోయిందన్నట్లు మీడియా దండోరా మొదలు పెట్టింది. గోమాంసం పేరుతో హత్యలు జరుగుతుంటే ముస్లిమ్ మహిళలు త్రిపుల్ తలాక్ ప్రధాన సమస్యగా భావించారని చెప్పడం మీడియా అమ్ముడుపోయిన వైనాన్ని చాటి చెబుతుంది. అవిద్య, పేదరికం, వెనుకబాటు వంటి అనేక సమస్యలకు తోడు భారత ముస్లిం సమాజం గోగ్రవాద దాడులతో అతలాకుతలమవుతుంటే మీడియా మాత్రం భారత ముస్లిం సమాజానికి ఉన్న ఒకే ఒక సమస్య త్రిపుల్ తలాక్ అని నమ్మించే ప్రయత్నాలు చేసింది. ఎవరిని నమ్మించే ప్రయత్నాలు. ముస్లిములకు వారి సమస్యలు ఎలాగూ తెలుసు కాబట్టి వారు నమ్మరు. ముస్లిమేతరులను, ముఖ్యంగా హిందూ ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం. దానివల్ల ఏం జరుగుతుంది? త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిములు వ్యతిరేకిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారన్న భావం ముస్లిమేతర సమాజంలో కలుగ జేయడం, ముఖ్యంగా బహుభార్వత్వం పట్ల ముస్లిములు సంస్కరణను వ్యతిరేకిస్తున్నారని హిందూ ప్రజలను నమ్మబలికి ఆ విధంగా ముస్లిములు తమ జనాభా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న హాస్యాస్పదమైన మాటను నమ్మేలా చేయడం. ఈ కుట్రలో మీడియాపూర్తిగా పాలు పంచుకుంది.
త్రిపుల్ తలాక్ విషయంలో మీడియా ఇచ్చిన తీవ్ర ప్రచారం చివరకు సుప్రీంకోర్టులోను ప్రతిధ్వనించింది. అక్టోబరు 16, 2015న ఒక హిందూ మహిళకు సంబంధించిన కేసులో వ్యాఖ్యనిస్తూ ఈ వివక్షలను విచారించడానికి స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. కాని దానికి కొన్ని రోజుల ముందే జరిగిన హత్యాకాండను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. భారత లౌకికవిలువలను సర్వనాశనం చేస్తున్న మతతత్వ విషం ఎంత భయానకంగా విస్తరిస్తుందో సుప్రీంకోర్టు పట్టించుకున్న దాఖలా కాని, దీనిపై వ్యాఖ్యానించిన ఉదాహరణ కాని లేదు. ఎందువల్లనంటే మీడియా ఈ వార్తలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వడమే లేదు.
సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను అక్టోబరులో చేసింది. అంతకు ముందు సెప్టెంబరు 28వ తేదీన యాభై సంవత్సరాల ముహమ్మద్ అక్లాక్ ను దాద్రిలో అతని ఇంట్లోనే గుంపులు దాడి చేసి చంపేశాయి. గొడ్డుమాంసం ఉందన్న అనుమానంతో చంపేశాయి. ఆయన ఇంట్లో గొడ్డుమాంసం లేదని తర్వాత తెలిసింది. అక్లాక్ కూతరు అడిగిన ప్రశ్న ’’ఆ మాంసం గొడ్డుమాంసం కాకపోతే నా తండ్రిని తెచ్చివ్వగలరా?‘‘ అన్న ప్రశ్న సుప్రీంకోర్టుకు కాని, మన పాలకపెద్దలకు కాని వినబడనే లేదు. అక్లాక్ కేసు విషయంలో మీడియా కాస్త శ్రద్ధ చూపించింది. కాని ఆ తర్వాత జరిగిన సంఘటనల పట్ల మళ్ళీ మీడియా అంత శ్రద్ధ చూపించలేదు. అక్లాక్ కేసు విషయంలో పబ్లిసిటీ కూడా గోరక్షకులకు పబ్లిసిటీ ఇచ్చే ఉద్దేశ్యంతో చేసిన పనేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అక్లాక్ కేసు తర్వాత అక్టోబరు 9వ తేదీన కేవలం కొన్ని రోజుల వ్యవధిలో జమ్ములో హిందూ జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో 19 సంవత్సరాల జాహిద్ అహ్మద్ ను గోరక్షకుల గుంపు వాహనంలోనే తగులబెట్టి చంపేశాయి. కారణం గోహత్య అన్న రూమార్లు ప్రచారంలో పెట్టడం. ఈ వార్త మరి మీడియాకు ఎందుకు కనబడలేదు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిన సంఘటన ఇది. అక్టోబరు 13వ తేదీన నోమాన్ అనే ట్రక్కు డ్రయివరును పశువులు రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో దాడి చేసి చంపేశారు. వరుసగా గుంపుల హత్యాకాండ జరుగుతుంటే మీడియాకు అది ముఖ్యమైన వార్త కాదా?
ఈ వార్తలేవీ మీడియాలో ప్రముఖంగా రాలేదు. కాని భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోళన్ కు చెందిన ముగ్గురు మహిళలు నవంబరులో ప్రధాని గారికి రాసిన లేఖను మీడియా కళ్ళకద్దుకుని పబ్లిసిటీ ఇచ్చింది. త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిమ్ మహిళలను కాపాడ్డమే ముస్లిం సమాజానికి చేసే పెద్ద మేలుగా ప్రచారం భారీగా జరిగింది.
ఇదంతా 2015లో జరిగిన వ్యవహారం. జులై 16, 2016న వెంకయ్యనాయుడు యూనిఫాం సివిల్ కోడ్, ఆరెస్సెస్ పరిభాషలో కామన్ సివిల్ కోడ్ వస్తే సెక్యులరిజమ్ పునాదులు చాలా గట్టిపడతాయని అన్నాడు. గాంధీజీని కూడా ఆయన కోట్ చేశాడు. ’’మతాలన్ని పరస్పర సహకారంతో బతికే పూర్తి సహనశీలం కలిగిన దేశం కావాలి‘‘ అని గాంధీగారు చెప్పిన మాటలను ఉద్ఘాటించాడు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోడీ త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతూ ముస్లిమ్ మహిళల సమస్యల పట్ల కడవల కొద్ది కన్నీరు కార్చాడు. ఆ తర్వాత అబూ సాలెహ్ షరీఫ్, సయ్యద్ ఖాలిద్ వంటి పరిశోధకులు మోడీని నిలదీశారు. 2011 జనాభా లెక్కలను ఉదాహరిస్తూ ముస్లిముల్లో విడాకులు పొందిన మహిళల శాతం కన్నా, హిందువుల్లో భర్త వదిలేసి, విడాకులు పొంది దుర్భరస్థితిలో బతుకుతున్న మహిళల శాతం చాలా ఎక్కువని వారి విషయమేమిటని నిలదీశారు. గణాంకాలు నిర్ఘాంతపోయేలా ముందుకు వచ్చాయి. 23 లక్షల మంది మహిళలు భర్త వదిలేసిన వాళ్ళు లేక, విడాకులు పొందిన వాళ్ళుంటే అందులో కేవలం 2 లక్షల 80 వేల మంది మాత్రమే ముస్లిం మహిళలు. ఈ ముస్లిమ్ మహిళల కష్టాల గురించి కన్నీళ్ళు సరే, మిగిలిన 20 లక్షల మహిళల సంగతేంటని అడిగారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజేపి గెలుపు వెనుక అనేక కారణాలున్నాయి. కాని ఎన్నికల్లో గెలిచిన వెంటనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగీ ఆదిత్యనాథ్ త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతూ ద్రౌపది వస్త్రాపరణం వంటిదన్నాడు. ఆయన కేబినేట్లో మంత్రి స్వామీ ప్రసాద్ మౌర్య మరింత రెచ్చిపోయి ముస్లిములు తమ కామవాంఛ కోసం త్రిపుల్ తలాక్ వాడుకుంటున్నారని అన్నాడు. మీడియా ఈ వార్తలకు ఇవ్వవలసిన ప్రాముఖ్యం ఇచ్చింది. మరి భార్యలను వదిలేసే ఇతర మతాల వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. 2011 గణాంకాల ప్రకారం 20లక్షల మంది ఇలాంటి మహిళలు ముస్లిమేతరులే. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. కాని మీడియా ఈ వాస్తవాలకు ఎన్నడూ ప్రాముఖ్యం ఇవ్వలేదు. బిజేపి, ఆరెస్సెస్ నేతల మాట నేలకు రాలక ముందే పతాక శీర్షికల్లో అలంకరణలుగా మార్చేస్తుంది. స్వామీ ప్రసాద్ మౌర్య వెంటనే క్షమాపణ చెప్పాలని ముస్లిమ్ విమెన్ పర్సనల్ లా బోర్డు డిమాండ్ కూడా మీడియాకు కనబడలేదు.
అసలు ఉత్తరప్రదేశ్ లో బిజేపి విజయానికి కారణం ముస్లిమ్ మహిళలు పెద్ద ఎత్తున మోడీ మాటలకు ప్రభావితులై, త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ఓటు చేయడమే అన్న విశ్లేషణలు నిస్సిగ్గుగా మీడియా అందించింది. ఒకవైపు గుంపుల హత్యాకాండలో చస్తున్న ముస్లిముల ప్రాణాలు ముస్లిమ్ మహిళలకు ముఖ్యంగా కనబడలేదు, కాని త్రిపుల్ తలాక్ (ముస్లిముల్లో విడాకులు తక్కువ) ఒక్కటే తమ సమస్యగా ముస్లిమ్ మహిళలు భావించారని చెప్పే ఈ మేధావులు, పాత్రికేయులు మానవత్వాన్ని నిలువెత్తు గోతిలో పాతేశారని చెప్పాలి.
ఎందుకంటే, ఒకవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రధాని అడుగుజాడల్లో త్రిపుల్ తలాక్ విషయమై కన్నీళ్ళు కారుస్తున్నప్పుడే యోగీ ఆదిత్యనాథ్ స్థాపించిన, ఆయన నాయకత్వం వహించే హిందూ యువవాహిని కార్యకర్తలు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయకతప్పలేదు. 45 సంవత్సరాల గులాం ముహమ్మద్ పై దాడి చేసి చంపేశారు. కారణం ఒక హిందూ అమ్మాయి ముస్లిమ్ యువకుగిని ప్రేమించి పెద్దలను వ్యతిరేకించి వారిద్దరు పారిపోడానికి కారణం అతనే అన్న అనుమానం. లవ్ జిహాద్ అంటే ఇదే అని ప్రచారం చేసి గుంపులు ఆయనపై దాడి చేసి చంపేశాయి. ముస్లిములపై దాడులు చేయడానికి ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు అనేక సాకులు అందించాయి. అందులో లవ్ జిహాద్ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో త్రిపుల్ తలాక్ వల్ల బిజేపికి ఓట్లు పడ్డాయని విశ్లేషణలు అందించడానికి ఉత్సాహపడిన మీడియా ఈ హత్యలకు మాత్రం పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు.
త్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మూడు ప్రతిపాదనలు ఇక్కడ గమనార్హమైనవి. అవి : 1. చట్టం ద్వారా కలుగజేసుకుని త్రిపుల్ తలాక్ రాజ్యంగవిరుద్దంగా ప్రకటించి ప్రభుత్వం కొత్త చట్టం చేయడం, 2. న్యాయపరంగా కలుగజేసుకుని తలాక్ కేవలం ఖుర్ఆన్ పేర్కొన్న సూత్రాల ప్రకారం, అహ్సన్ పద్ధతిలో మూడునెలల ప్రక్రియగా జరగాలని తీర్మానించడం. 3. ముస్లిమ్ సముదాయంలో అంతర్గతంగానే సంస్కరణలు రావడం.
అనేక ముస్లిం సంస్థలు, చివరకు భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ కూడా రెండవ ఆప్షన్ వైపు మొగ్గు చూపాయి. ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు మూడవ ఆప్షన్ వైపు మొగ్గు చూపింది. కాని విచిత్రంగా ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్ రోహ్తగీ మాత్రం అసలు తలాక్ అనేదే నిషేధించాలని అన్నాడు. ఇది హాస్యాస్పదంగా అనిపించడం లేదా. తలాక్ అనేదే నిషేధిస్తే, ముస్లిములకు విడాకులనేవి లేనే లేవని భావించాలా? హిందూకోడ్ బిల్లు వచ్చినప్పుడు ఈ మతతత్వవాదులు ఎంత నిరసన తెలిపారో ఇక్కడ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు అస్సలు విడాకులే ఉండకూడదన్న వాదప ముకుల్ రోహ్తగీ చేశాడు. మరి ముస్లిములకు విడాకుల అవకాశం లేదా అంటే ముందు రద్దు చేయండి తర్వాత మేం మరో చట్టం తెస్తాం అన్నాడు. అంటే ఈ ప్రభుత్వం ముస్లిమ్ పర్సనల్ లాను రద్దు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుందే తప్ప మరో ఉద్దేశ్యమేమీ లేదు. వెంకయ్య నాయుడు మరో అడుగు ముందుకు వేసి సుప్రీంకోర్టు త్రిపుల్ తలాక్ రద్దు చేయకపోతే తామే చట్టం చేసేస్తామని అన్నాడు. పర్సనల్ లా వ్యవహారాల్లో కలుగుజేసుకోవడం మా ఉద్దేశ్యం కాదు, మహిళలకు న్యాయం చేయడమే మా ద్దేశ్యం అని గంభీరంగా తమ సదుద్దేశ్యాన్ని చెప్పాడు కాని మరోవైపు గోగ్రవాదం జనాన్ని చంపుతుంటే, ముఖ్యంగా ముస్లిములను చంపుతుంటే ఆయన మాటలు పైశాచికంగా కనిపించడం లేదా?
2010 నుంచి 2017 మధ్య కాలంలో గొడ్డుమాంసం, గోగ్రవాదం సంబంధించి జరిగిన సంఘటనలు మొత్తం 63 అయితే అందులో 32 సంఘటనలు బీజేపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. దాడులన్నీ దాదాపుగా ముస్లిములపైనే జరిగాయి. ఈ సంఘటనల్లో దాదాపు 97శాతం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. 2017లో ఈ హత్యలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రిపుల్ తలాక్ కాదు అసలు తలాక్ రద్దు చేసి ముస్లిమ్ మహిళల సమస్యలు పరిష్కారిస్తామంటున్న మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి.
మన మీడియా గోగ్రవాదాన్ని పట్టించుకోకపోయినా అంతర్జాతీయంగా ఈ సంఘటనలు ప్రచారం పొందుతూనే ఉన్నాయి. భారతదేశం అహింసాభూమి అని, గాంధీ గారి దేశమని ప్రపంచదేశాల్లో ఉన్న మన ప్రతిష్ఠ ఇప్పుడు మసకబారుతోంది. ఫ్రాన్సులో రచయిత, జర్నలిస్టు విలియం డి తామారిస్ ఒక్ కామిక్ పుస్తకం రాశాడు. గోరక్షకుల గురించిన పుస్తకమది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీఫ్ బ్యాన్ గురించి, హిందూత్వ గురించి రాసిన పుస్తకం. ఈ రచయిత ఫ్రాన్సులో కూర్చుని రాయలేదు, దాద్రిలో ముహమ్మద్ అక్లాక్ హత్య తరువాత గోరక్షకుడిగా చెప్పుకునే విజయకాంత్ చౌహాన్ అనే వ్యక్తిని కలిసి మాట్లాడిన తర్వాత ఈ పుస్తకంపై పనిచేయడం ప్రారంభించాడు. భారతదేశమంటే తమ మనసుల్లో ఉన్నా భావాలన్నీ ఈ పుస్తక రచన క్రమంలో సేకరించిన సమాచారంతో మారిపోయాయని ఆయన అన్నాడు. స్క్రోల్ డాట్ ఇన్ ఈ విషయమై కథనాన్నిచ్చింది. గాంధీగారి దేశంగా భావించేవాళ్లమని ఇప్పుడా పరిస్థితి లేదని రచయిత అన్నాడు. మహారాష్ట్ర, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో రచయిత పర్యటించాడు. విజయకాంత్ చౌహాన్ అనబడే ఈ గోరక్షకుడు మాత్రమే కాదు, గోరక్షకులు చాలా మంది జర్నలిస్టులతో మాట్లాడ్డానికి చాలా ఉత్సాహం చూపించారంట. విజయకాంత్ అయితే తానే నాథూరాం గాడ్సే అయితే మరోసారి గాంధీని చంపుతానన్నాడట (స్క్రోల్ డాట్ ఇన్). ఈ పుస్తకం మార్కెటులోకి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ మీడియా 2002 గుజరాత్ ఘోరకలి గురించి కూడా మాట్లాడ్డం మొదలుపెట్టింది.
గోగ్రవాదం దేశాన్ని అంతర్జాతీయంగా అప్రతిష్ఠపాలు చేస్తుంటే, హత్యలు వరుసగా జరుగుతుంటే, మోడీ కేవలం మాటలతో గోరక్షణ పేరుతో హింసను భరించలేమంటూ కేవలం ముచ్చటగా మూడు సార్లు (ఇప్పటి వరకు) ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కాని మరోవైపు త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిమ్ మహిళల కష్టాలు తీరుస్తామంటూ వందలసార్లు, వేలసార్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ మాటలను ఎవరైనా నమ్మవచ్చు కాని దౌర్జన్యాలకు గురవుతున్న ముస్లిములు, దళితులు మాత్రం నమ్మలేరు.