ముస్లిమ్ కుటుంబానికి ఫ్లాట్ విక్రయించొద్దని హౌసింగ్ సొసైటీ తీర్మానం
17-09-2016 10:36:31
ముంబయి : ముస్లిమ్ కుటుంబానికి ఫ్లాట్ విక్రయించరాదని హౌసింగ్ సొసైటీ తీర్మానించిన ఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకుంది. ముంబయిలోని వాసవి హౌసింగ్ సొసైటీలో 16 ఫ్లాట్లుండగా 11 మంది ఫ్లాట్ యజమానులు సమావేశమై ముస్లిమ్ కుటుంబానికి ఫ్లాట్ విక్రయించరాదని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కాగా ఈ సమావేశానికి ఈ సొసైటీలో నివాసముంటున్న రెండు ముస్లిమ్ కుటుంబాలు దూరంగా ఉన్నాయి. తమ అపార్టుమెంటులోని మొదటి అంతస్థులో ఓ ఫ్లాట్‌ను ముస్లిమ్ కుటుంబానికి విక్రయించనున్నట్లు తమకు తెలిసిందని, శాకాహారులైన గుజరాతీ కుటుంబాలు ఎక్కువగా నివాసముంటున్న దృష్య్టా ముస్లిమ్ లకు ఫ్లాట్ విక్రయించవద్దని హ్యాపీ జీవన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు తీర్మానించి, ఆ ప్రతిని బిల్డరు అయిన కాంతాబెన్ పటేల్, జిగ్నేష్ పటేల్ లకు పంపించారు. ముస్లిమ్ గ్లాస్ వ్యాపారి అయిన వికార్ అహ్మద్ ఖాన్ కు 710 చదరపు గజాల ఫ్లాట్ ను విక్రయించేందుకు ఒప్పందం చేసుకొని అడ్వాన్సుగా లక్ష రూపాయలు కూడా తీసుకున్నామని బిల్డరు జిగ్నేష్ చెప్పారు. తాము ఫ్లాట్ ను వికార్ అహ్మద్ ఖాన్ కు విక్రయించేందుకు నిర్ణయించుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సొసైటీని కోరగా, సొసైటీ ఎన్ ఓసీ జారీ చేసేందుకు నిరాకరించిందని జిగ్నేష్ పేర్కొన్నారు. ముస్లిమ్ కుటుంబాలకు ఈ ఫ్లాట్ విక్రయించకుండా ఉండటంతోపాటు గుజరాతీలైన పటేల్ కుటుంబానికే విక్రయించడానికి ప్రాధాన్యమివ్వాలని తమ సొసైటీ నిర్ణయించిందని సొసైటీ కార్యదర్శి జితేంద్రజైన్ చెప్పడం విశేషం. ముంబయిలో గతంలోనూ ముస్లిమ్ లకు ఫ్లాట్ విక్రయించమని చెప్పడం సంచలనం రేపింది. మరోసారి ఈ వివాదం రాజుకోవడంతో తాము హౌసింగ్ సొసైటీల సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించనున్నట్లు బిల్డరు చెపుతున్నారు.

No comments:
Post a Comment