Manjunadha Commission
http://epaper.andhrajyothy.com/c/13256691
కొత్త వారికి రిజర్వేషన్లతో.. బీసీలకు ఎలాంటి నష్టం ఉండదు!
17-09-2016 01:07:51
వెనుకబాటుతనం ఆధారంగా 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు
రాజకీయ రిజర్వేషన్లకు సిఫారసు చేయం
పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ
పల్స్ సమాచారంతో క్రోడీకరించి నివేదిక
నివేదిక ఇచ్చేందుకు ఎలాంటి గడువు లేదు
శాసీ్త్రయతే మా లక్ష్యం.. ఒత్తిళ్లు లేవు
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధాన సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని సామాజిక వర్గాల, ప్రాంతాల ప్రజల వాస్తవిక స్థితిగతులేంటి అన్న కోణంలో ఇప్పటికే సాధికార సర్వే ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్న విషయం విదితమే. మరోవైపు క్షేత్రస్థాయిలో బీసీ కులాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎల్.మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఈనెల 19 నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది. తొలి విడత చిత్తూరు జిల్లా నుంచి ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభిస్తున్నారు. అనంతరం కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణను చేపడతారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌కు బీసీ కమిషన్ నివేదిక సమాధానం కానుంది. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ...
కొత్తవారికి కోటాతో నష్టపోతామని బీసీలు అంటున్నారు?
ఏ రాష్ట్రంలో అయినా గరిష్ఠంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయితే అది కచ్చితంగా 50 శాతానికే లోబడి ఉండాలని కాదు. రాష్ట్రంలో ఎక్కువమంది వెనుబాటుతనంలో ఉంటే అందుకు బలమైన కారణాలు చూపించి ఎంతవరకైనా రిజర్వేషన్లు పొందవచ్చన్న ప్రొవిజన్ కూడా ఉంది. కాబట్టి బీసీలకు నష్టం జరగదు. కొత్తగా రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చినా అవి అదనంగా వస్తాయి తప్ప ఉన్నవారికి ఇబ్బంది ఉండదు. ఏపీలోని 5 కోట్ల మందిలో అత్యధిక మంది వెనుకబడి ఉంటే ఆ స్థాయిలో రిజర్వేషన్లు పొందవచ్చు.
బీసీ కమిషన్‌కు ఇప్పటిరకూ ఎన్ని వినతులు వచ్చాయి?
నా నేతృత్వంలో బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత 13 జిల్లాల నుంచి 3000 వరకు వినతిపత్రాలు అందాయి. 61 సామాజిక వర్గాలు తమను బీసీల్లో చేర్చాలని కోరాయి. 25 సామాజిక వర్గాలు బీసీల్లోనే గ్రూపు మార్చాలని అడిగాయి. వీరితో పాటు కాపులతో సహా మరే ఇతర కులాన్ని బీసీల్లో చేర్చొద్దని పలు బీసీ సంఘాల నుంచి విన్నపాలు వచ్చాయి. కాగా రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం మాత్రమే రిజర్వేషన్ కోసం ముందుకు రాలేదు.
ప్రజాభిప్రాయ సేకరణ ఎలా?
13 జిల్లా కేంద్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం. వీలును బట్టి ఇతర పట్టణాల్లోనూ చేపడతాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశాం. ఆ జిల్లా నుంచి వినతులు ఇచ్చిన వారందరికీ ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం పంపించాం. వెబ్‌సైట్, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం ఇస్తున్నాం. ఏదైనా కులాన్ని బీసీల్లో చేర్చాలని కోరినా, వద్దని అభ్యంతరం తెలిపినా, గ్రూపు మార్చాలన్నా అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలి.
ఒక్కో జిల్లాకు ఎంత సమయం కేటాయిస్తున్నారు?
ఇంత సమయం అని ప్రత్యేకంగా లేదు. ఎక్కువ మంది ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటే ఎక్కువ సమయం పడుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. అయితే ఒకే సమాచారం ఎక్కువ మంది నుంచి స్వీకరించం. దానివల్ల సమయం వృథా. మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ల ద్వారా మినిట్స్ రికార్డు చేస్తారు. దీనివల్ల ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చారో స్పష్టంగా, పారదర్శకంగా ఉంటుంది.
ప్రజాభిప్రాయ సేకరణ ప్రశ్నావళి..?
ఆరు మాడ్యూల్స్ తయారుచేశాం. ఇందులో దాదాపు 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ఎవరైనా అభిప్రాయాలు తెలపవచ్చు. 1. బీసీల్లో చేర్చాలని కోరే వారి కోసం 2. బీసీల్లో చేర్చొద్దని అభ్యంతరం తెలిపే వారి కోసం 3. గ్రూపు మార్చమనే వారికోసం 4. బీసీల్లో చేర్చమని కోరుతున్న వారిపై ఆక్షేపణలు 5. జీవన విధానంలో సాధారణ అంశాలు తెలుసుకొనేందుకు 6. ఇప్పటికే ఉన్న దరఖాస్తులపై అభిప్రాయాల కోసం... వంటి ఆరు రకాల ప్రశ్నావళులు రూపొందించాం. ప్రతి దాంట్లో అనేక ప్రశ్నలు ఉంటాయి.
వెనుకబాటుతనంలో ఏ అంశాలు ప్రధానం?
సామాజిక, విద్యా రంగాల్లో ఎవరు ఎలా ఉన్నారన్నదే ప్రధానాంశంగా తీసుకుంటాం. కొన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ వారికి సమాజంలో సరైన గౌరవం దక్కట్లేదనే భావన ఉంది. సంపాదన బాగున్నా వృత్తిరీత్యా వెనుకబాటుతనం ఉంది. కాబట్టి సామాజిక కోణం అత్యంత ప్రధానాంశంగా తీసుకుంటున్నాం. సామాజిక వెనుకబాటుతనం కీలకం అవుతుంది. అలాగే విద్య ద్వారా గౌరవం పొందవచ్చు. అందువల్ల ఎంతమంది విద్యా రంగంలో ముందున్నారనేది మరో కీలక అంశం. ఒక్కో సామాజిక వర్గంలోని ప్రజల ఆహారపు అలవాట్లు ఏంటి.. ఆచార వ్యవహరాలు ఏంటి.. మద్యం సేవించడం.. సిగరెట్లు తాగడం.. మాంసం తినడం వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం.
రాజకీయ రిజర్వేషన్లకు కూడా సిఫారసు చేస్తారా?
ఏ కులంలో ఎంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారు ఏ స్థాయిల్లో ఉన్నారు అనేవి తీసుకుంటాం. కానీ ఈ సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది మాత్రం సిఫారసు చేయబోం. అది ప్రభుత్వం పరిధిలోది. ప్రతి సామాజిక వర్గంలో ప్రస్తుతం, గతంలో ఎంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయాలు పల్స్ సర్వే ద్వారా వస్తాయి.
ఒకే కులం ఒక చోట బలంగా.. మరోచోట బలహీనంగా
ఒక సామాజికవర్గం రాయలసీమలో ఆర్థికంగా బాగుంటే, ఉత్తరాంధ్రలో పేదరికంతో ఇబ్బంది పడుతుండవచ్చు. ఇలాంటి పరిస్థితి అనేక కులాల్లో ఉంది. పైగా ఒకే కులంలోని ఉపకులాలే కొత్తగా రిజర్వేషన్లు వద్దని అభ్యంతరాలు చెబుతున్నారు. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ కులం పేదరికం, సామాజికంగా వెనుకబడి ఉందో అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తాం.
కమిషన్‌పై ప్రభుత్వ ఒత్తిడి ఉందనే ఆరోపణలున్నాయి?
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఇప్పటివరకూ నన్ను ఏ రాజకీయ నాయకుడు కలవలేదు. అందరిలాగే వచ్చి వారి సామాజికవర్గాల గురించి వినతులు ఇచ్చారు తప్ప మరోవిధంగా ఎవరూ రాలేదు, ఫోన్‌లో మాట్లాడలేదు. కమిషన్ నియామకం తర్వాత సీఎంతో కూడా మాట్లాడలేదు. కమిషన్‌పై ఒత్తిళ్లు ఉన్నాయనేది అపోహ మాత్రమే. మేం అందరి నుంచి వినతులు స్వీకరిస్తాం.
ప్రభుత్వానికి నివేదిక ఎప్పటిలోగా ఇస్తారు?
నివేదిక సమర్పణకు నిర్దిష్ట సమయం లేదు. సమయం పెట్టుకుంటే నివేదిక శాస్ర్తీయంగా ఇవ్వలేం. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో సమగ్ర సర్వే జరగడం దేశంలో ఇదే తొలిసారి. ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు, సాధికార సర్వే వివరాలు క్రోడీకరించాల్సి ఉంటుంది. దానిని అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందించాలి. ఇందుకు సమయం కచ్చితంగా చెప్పలేం. మా నివేదికపై తర్వాత ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఏ కోర్టు కూడా మా నివేదికలో లోపాలు ఎత్తి చూపకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భవిష్యత్తులో మంజునాథ్ కమిషన్ నివేదిక లోపభూయిష్టం అనే పేరు వినకూడదని నా అభీష్టం.
నివేదిక తర్వాత ప్రక్రియ ఏంటి?
రాష్ట్ర ప్రజల సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక అంశాల పరంగా సిఫారసులు చేయడమే మా బాధ్యత. ఆ తర్వాత దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది మాత్రమే మేం చెబుతాం. కారణాలు బలంగా ఉంటే ఎంతమందికైనా రిజర్వేషన్లు కల్పించేందుకు న్యాయపరంగా అవకాశాలున్నాయి. నివేదిక రూపకల్పన కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల నుంచి కూడా సమాచారం కోరాం. అక్కడ ఏ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు అనేది ఆయా సంస్థలు, కార్యాలయాలు వివరాలు ఇవ్వాల్సి ఉంది.