చేటు చేసే ముస్లింవాదుల మౌనం
Sakshi | Updated: July 17, 2016 23:50 (IST)
http://www.sakshi.com/news/opinion/muslim-activists-follows-as-an-silent-to-harm-362913
ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది. అస్తిత్వవాదాలలో ఇతర వాదాలకు ఉన్న వెసులుబాటు ముస్లింవాదానికి లేదు. స్త్రీ, దళిత, తెలంగాణవాదులను వారి మాతృ సమూహాలు ఓన్ చేసుకున్నాయి. కాని ముస్లింవాదులకు ఆ పరిస్థితి లేదు. వారు తెలుగులో రాయడం, అంతర్గత వెనుకబాటుతనాలపై రాయడం వారి మాతృ సమూహం నుంచి చిన్నచూపుకు గురవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముస్లింవాద పెద్దలు పూనుకొని కొంత సరళం చేసే అవకాశముండింది. కానీ వారెవరూ దీనికి సుముఖంగా లేకపోవడం వైచిత్రి.
ముస్లింల జీవితాలను కథలుగా మలచాలంటే, నవలీకరించాలంటే అందులోని అన్ని పార్శ్వాలూ రికార్డు అయ్యే వాతావరణం, వెసులుబాటు ఉండాలి. తమ సమాజంలోని మంచీ చెడూ, విశ్వాసమూ అవిశ్వాసమూ, పాజిటివ్ అంశాలూ నెగెటివ్ అంశాలూ, అన్నీ రాయగలిగే, చర్చించగలిగే వాతావరణం ఉండాలి. అలాకాకుండా తాము కదలకుండా, తర్వాతి తరాన్ని కదలనివ్వకుండా చెయ్యడం, విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని వాదించడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. ప్రగతిశీలురుగా మొదలైన సాహిత్యకారులు కొత్తగా మత ఆచారాలను పాటించడం, విశ్వాసులుగా ప్రవర్తించడం లాంటి వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్యవంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించింది.
నిజానికి ముస్లిం సమాజం ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇండియాలోనే కాదు, అంతర్గతంగానూ పెను ప్రమాదంలో ఉంది. కొన్ని జమాత్ (మత సంస్థలు) ముస్లింలను మరింత మౌఢ్యంలోకి నెడుతున్నాయి. మొత్తంగా ఇండియన్ ఇస్లాం(లోకల్ ఇస్లాం)ను రద్దు చేస్తూ అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారు. ఉదాహరణకు దర్గాల దగ్గరకు వెళ్లడం, పీర్ల పండుగ చేయడం, ఖబ్రస్తాన్‌లకు వెళ్లడం, ఫాతెహాలివ్వడం చేయకూడదని విశ్వాసుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. చస్తే ఆ శవంపై కాఫిర్‌ల నీడ పడకూడదనే తీవ్ర వాదనలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పరలోక జ్ఞానం తప్ప లోకజ్ఞానం లేకుండా చేస్తూ ముస్లిం సామాజిక జీవనానికి గుదిబండ కడుతున్నారు. వీటన్నింటివల్ల నాన్ ముస్లింలకూ, ముస్లింలకూ మధ్య దూరం పెరుగుతోంది. ఈ నిజాలు విప్పి చెబుతూ, సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక ముస్లిం సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.
- స్కైబాబ
9885420027
స్కైబాబాకు ఒక సిధ్ధాంత వ్యాసం రాసే స్తోమత లేదు.
Visweswara Rao గారూ! మీరు పోస్టు పెట్టాక ఈ వ్యాసం మళ్ళీ చదివాను. ఇంతకు ముందు Facebook లో పెట్టిన దానికి ఇది కొంచెం వివరణ అనుకుంటాను. Facebook లో నాపేరు వుంది. ఇక్కడ తీసేశారు. అదొక్కటే తేడా.
సాక్షీ లో ’చేటు చేసే ముస్లింవాదుల మౌనం’ పేరుతో ప్రచురితమైన వ్యాసంలో శీర్షిక దగ్గర నుండి చివరి పదం వరకు స్కైబాబా అజ్ఞానం, అమాయికత్వం, అబధ్ధాలే కనిపించాయి. అసహనం – మతసామరస్యం, ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటుల గురించి అనేక సిధ్ధాంత వ్యాసాలు వచ్చాయి. వాటి ముందు ఇవ్వాల్టి స్కైబాబా వ్యాసం చిట్టెలుక కూడా కాదు. స్కైబాబాకు ఒక సిధ్ధాంత వ్యాసం రాసే స్తోమత ఎన్నడూ లేదు. అది చేతకాకపోయినా ఫరవాలేదు. కనీసం నిర్ధిష్ట ఉదాహరణలు (Case References) ఇచ్చే స్తోమత కూడా అతనికి లేదు. ప్రగతిశీలురు, అభివృధ్ధికాముకులు, నాస్తికులు, హేతువాదులు, సామ్యవాదులు, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, ఉపయోగితావాదులు, భోగవాదులు, అస్థిత్వవాదులు, సామరస్యవాదులు వగయిరా ప్రాపంచిక దృక్పధాల మధ్యగానీ, సంస్కరణ, ఉద్యమం, విప్లవం వంటి సామాజిక మార్పుల మధ్యగానీ తేడా కూడా అతనికి తెలీదు. ఓ నాలుగు రోజులు ఆగండి నేనే సాక్షిలో మరింత వివరంగా రాస్తాను.
No comments:
Post a Comment