Monday, 16 May 2016

Some Doubts on the Programme of Communist Party of India

భారత కమ్యునిస్టుపార్టీ కార్యక్రమం మీద కొన్ని సందేహాలు 


“ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. “

ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు భారత కమ్యునిస్టుపార్టీ కార్యక్రమం మీద కొన్ని సందేహాలు కలిగాయి. 


1. భారత కమ్యూనిస్టు పార్టి 1947 సెప్టెంబర్ లోనే ఎందుకు సాయుధ పోరాటాన్ని మొదలెట్టిందీ?
2. 1948 సెప్టెంబర్ లోనే ఎందుకు విరమణ ప్రకటించిందీ?
3. ఆ సాయుధపోరాటం నైజాం సంస్థానంలోనే సాగిందా? దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ కొనసాగిందా? మిగిలిన వాటి విస్తృతి ఎంత?
4. దాదాపు వంద సంవత్సరాల సుదీర
్ఘ చరిత్రలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం కేవలం నిజాంను గద్దెదించడం కోసమేనా?
5. ”ముస్లిం’ నిజాం సంస్థానాన్ని ’హిందూ’ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే ’హిందూత్వ’ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగావుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండిందా?
6. కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాటవిరమణ చేయమన్నారు. ఇద్దరూ ఒకే మతవాదాన్ని కొనసాగించారా?



Pendyala VaraVara Rao
1946లో చైనా నూత‌న ప్ర‌జాస్వామిక విప్లవ పంథా అనుస‌ర‌ణీయ‌మ‌ని భావించింది గ‌నుక, 1947 ఆగ‌స్టులో జ‌రిగింది కేవ‌లం ట్రన్స్ఫర్ ఆఫ్ పవర్ అని విశ్లేషించింది గనుక. 46 జులై 4న ప్రకటించిన సాయుధ పోరాట పంథాను చేపట్టింది. మగ్ధూమ్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు.

నెహ్రూ socialist stance పట్ల విశ్వాసం, ఆ భ్రమలతో మితవాద వర్గం మిలిటరీ యాక్షన్ తర్వాత పోరాట విరమణ చేయాలన్నారు. దానికి కూడా రా.నా. నాయకుడు. అయితే మెజారిటీ వ్యతిరేకించారు గనకనే 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది. ముఖ్యంగా ప్రజలు కోరుకున్నారు. అప్పటికి మతవాసనాలున్నాయని చెప్పలేము. ఎందుకంటే 1952లో పి.డి.ఎఫ్ కు నాయకత్వం వహించిన డా.జయసూర్య స్వయంగా రజాకార్ల పేరుతో కనీసం 40 వేలు, గరిష్టంగా 2లక్షల మందిని యూనియన్ మిలిటరీ చంపిందని కేంద్ర హోం మినిస్ట్రీ కి సమగ్ర రిపోర్టు ఇచ్చాడు. సుందర్ లాల్, నెహ్రూ స్నేహితుడు కూడా 40 వేల మంది ముస్లింలను చంపారని నెహ్రూకు రిపోర్టు ఇచ్చాడు. ఈ సమాచారం అనండి, చరిత్ర అనండి, దీనినుంచి conclusions ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు డ్రా చేయవచ్చు. అయితే జూలై 4 పిలుపుకు ప్రేరణ దొడ్డి కొమరయ్య హత్యపై విసునూరు దొరకు వ్యతిరేకంగా. జనరల్ గా తెలంగాణ, హైదరాబాదు రాజ్యం మొత్తంగా హిందూ భూస్వాములకు వ్యతిరేకంగానే... తక్కువమంది ముస్లిం భూస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవచ్చు. కానీ పార్టీ విశ్లేషనయే హిందూ భూస్వామ్య పిరమిడ్ పై ముస్లిం ప్రభువున్నాడని. వ్యవస్థ పునాది వీళ్ళని. రజాకార్ల స్వల్ప కాలం మినహాయిస్తే మిగిలిన కాలమంతా ఇక్కడ హిందూ ముస్లింలు రైతులు, కౌలుదారులుగా జీవించారు. బందగీ ఈ పోరాటానికి వేగుచుక్క. కామ్రేడ్స్ అసోసియేషన్ లో డి.వి తప్ప మిగతా అందరూ ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు.
LikeReply1May 18, 2016 11:52pm
Pendyala VaraVara Rao
ట్రావన్ కోర్ కొచ్చిన్ లో మోప్లా పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ముస్లిం రైతాంగం బ్రాహ్మణ భూస్వాములకు వ్యతిరేకంగా చేశారు.
LikeReply1May 18, 2016 11:53pm

A.m. Khan Yazdani Danny ·
Works at Journalist
ఖిలాపత్ ఉద్యమం మీద బ్రిటీష్ పాలకులు సాగించిన క్రూరఅణిచివేత మోఫ్లా ముస్లింల తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం. బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టులు 1925 తరువాతనే ఒక పార్టీగా ఏర్పడ్డారు. మోఫ్లా వుద్యమం 1922 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటికి భారత కమ్యూనిస్టు పార్టీకి సాయుధ పోరాట పంథా లేదు.



చరిత్ర-చర్చ

-      వరవరరావు

Sakshi | Updated: May 03, 2016 01:35 (IST)
ʹతరగతి గదుల‌ నుంచి నిష్క్రమిస్తున్న ʹచరిత్రʹ పార్లమెంటు కెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్‌ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కల‌లుగన్న సమాజం తదితరాల‌ పై సాగాల‌ని..ʹ ఆశించినప్పుడు ఆయన అవగాహనపై, విప్లవ ఆచరణపై మరింతగా దృష్టి పెట్టాలి. భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ వసవాదులు ఉరితీయాల‌ని సంకల్పించుకోవడానికి ప్రధానమైన కారణం ʹఆయన రూపొందుతున్న లెనిన్‌ʹ అని గుర్తించి భయపడడమేనని అన్నాడు బిపిన్‌ చంద్ర.
అయితే భగత్‌సింగ్‌ను విప్లవకారుడుగా గుర్తించడానికి పాల‌కుల‌యిన వల‌సవాదుల‌కు సరే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల‌కన్నిటికీ ఏదో ఒక అభ్యంతరముండింది. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదంతో, కార్మిక కర్షక రాజ్యస్థాపన కోసం ఆయన పంజాబ్‌ మొదలు ఉత్తరప్రదేశ్‌ వరకు ఏర్పాటు చేసిన కిర్తి కిసాన్‌ పార్టీ, హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌, నవజవాన్‌ భారత్‌ సభ ఎంచుకున్న ఆశయాలు, మార్గం చూసినా ఆనాటి రాజకీయ పార్టీల‌కు దేనికీ ఆమోదయోగ్యమైనవి కాదు. 1936 కరాచీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా నెహ్రూ ఆయన అనుయాయులు భగత్‌సింగ్‌ ఆదర్శాన్ని, త్యాగాన్ని కొనియాడినట్లు కనిపించినా నెహ్రూపై, కాంగ్రెస్‌ పార్టీపై గాంధీకున్న పట్టువ‌ల్ల‌ వాళ్ల సమర్థనకు పరిమితులేర్పడినాయి. పైగా గాంధీ ఎంచుకున్న అహింసామార్గం, సామరస్య ధోరణి, కాంగ్రెస్‌ పార్టీ పథ నిర్దేశాల‌య్యాయి.
భగత్‌సింగ్‌, సహచర విప్లవకారుల‌ పోరాటాల నాటికే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా - అది కార్మికవర్గ పార్టీగా వర్గ పోరాటాన్ని నిర్వహించవల‌సిందే అయినా ఆయన మార్గాన్ని వాళ్లు అనుసరించనూ లేదు. ఆయనను తమలోకి ఆహ్వానించనూ లేదు. లాహోర్‌, కాకోరీ కుట్ర కేసుల్లో ముద్దాయిగా ఉన్న వాళ్లలో విజయకుమార్‌ సిన్హా, శివకుమార్‌ మిశ్రా ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరినా - ఈ రెండు పంథాలు విడివిడిగానే మునుసాగాయి. ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. బిపిన్‌ చంద్ర ఈ కమ్యూనిస్టు సంప్రదాయానికి, అవగాహనకు చెందినవాడు. కనుక వల‌స పాల‌కుల‌కు, గాంధీకే కాదు 1951 నాటికి కమ్యూనిస్టు పార్టీకి కూడా భగత్‌సింగ్‌ను ఆయన విప్లవ ల‌క్ష్యంతో పంథాతో స్వీకరించి సమర్థించడానికి పరిమితులేర్పడినాయి. వల‌సవాద చరిత్రకు బదులుగా ʹజాతీయోద్యమ చరిత్రʹగా భారతదేశ చరిత్ర రచన అప్పగించబడిన బిపిన్‌ చంద్ర వంటి వాళ్లకు కూడా అందుకే భగత్‌సింగ్‌ విప్లవ టెరరిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనను ʹసామ్యవాద విప్లవకారుడుʹగా పేర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకయినా, బిపిన్‌ చంద్రకయినా సామ్యవాద విప్లవానికి వర్గపోరాటం అనివార్యమన్న అవగాహన పట్ల విశ్వాసం పోయింది. పార్లమెంటరీ రాజకీయాల‌ ఊబిలో కూరుకుపోయారు. తాము 1946-51లో ఉజ్వల‌ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించాము - అని గత ఘన చరిత్రగా చెప్పుకోవడానికి తప్ప కమ్యూనిస్టు పార్టీ ఆ పంథా నుంచి వైదొల‌గింది. నెహ్రూ అనుకూల‌ పార్టీగానే కాదు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని బపరిచే దాకా ఆ కుటుంబాల‌ ఫెలో ట్రావ‌ల‌ర్ గా మారింది. (సాధారణంగా నెహ్రూ, కృష్ణమీనన్‌ వంటి వాళ్లను ఫెలో ట్రావెల‌ర్స్‌ అంటారు గానీ వాళ్లు పాల‌కులుగా చిరకాలం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లను బపరచిన కమ్యూనిస్టును ఫెలో ట్రావెల‌ర్స్‌ అనడమే సబబుగా ఉంటుంది.)
బిపిన్‌ చంద్ర మొదలైన మార్క్సిస్టు చరిత్రకారుల‌ కృషి పట్ల పూర్తి గౌరవంతోనే వాళ్ల చరిత్ర రచనకున్న ఈ పరిమితిని కూడా అర్థం చేసుకోవాలి. భగత్‌సింగ్‌పై ప్రత్యేకించి కృషి చేసిన వారిలో బిపిన్‌ చంద్ర, ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌ను మించిన వాళ్లు ఎవరూ ఉండకపోవచ్చు. ఒక కోణంలో మహమ్మదలీ జిన్నా, ఎజినూరానీు ఉండవచ్చు. కాని భగత్‌సింగ్‌ను విప్లవకారుడుగా ʹరూపొందుతున్న లెనిన్‌ʹగా చరిత్రలో నమోదు చేయడానికి ఆయన విప్లవ హృదయాన్ని వర్తమానంలో ఆవిష్కరించే ప్రాపంచిక దృక్పథం చరిత్రకారుల‌కుండాలి. భగత్‌సింగ్‌పై అధ్యయనం, పరిశోధన చేసేవారికుండాలి. చరిత్ర అంటే ʹవర్తమానంలో గతం భవిష్యత్తుతో చేసే సంభాషణʹ అనే ఇ.ఎచ్‌.కార్‌ నిర్వచనానికి అర్థం అదే.
ʹప్రజ కర్ణాటక చరిత్రʹను పునర్‌ నిర్మించే క్రమంలో స్వయంగా విప్లవకారుడు అమరుడు సాకేత రాజన్‌ అటువంటి చరిత్ర రచనకు ప్రయత్నం చేశాడు. రెండు బృహత్‌ సంపుటాలు వెలువడి ప్రామాణిక కృషిగా గుర్తింపబడింది. సాకేత రాజన్‌ వంటి వేలాది విప్లవకారుట‌ను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్న ఆయా ప్రభుత్వాల‌లోని పాల‌కుకు, విప్లవకారుల‌ను టెరరిస్టులుగా, దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్‌గా పేర్కొంటున్న బిజెపికి భగత్‌సింగ్‌ మీద ఇంత ప్రేమ కల‌గడం చారిత్రక అవకాశవాదం కాకమరేమిటి?
భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ్ని ఎలా అయ్యానుʹ అనే పరిణామంగానీ, ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గానీ బిజెపికి జీర్ణమయ్యే విషయాలేనా? పుట్టుక వ‌ల్ల‌నే హిందువు కాని భగత్‌సింగ్‌ చైతన్యం వ‌ల్ల విప్ల‌వ‌కారుడ‌య్యాడు. హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా భిన్న విశ్వాసాల‌ ప్రజల‌పై రుద్దుతున్న బిజెపి భగత్‌సింగ్‌ భుజం మీద తుపాకి పెట్టి బిపిన్‌ చంద్ర వంటి లౌకిక ప్రజాస్వామిక, ప్రగతివాద చరిత్రకారుల‌ను, నెహ్రూ అనుయాయుల‌ను, కమ్యూనిస్టుల‌ను మాత్రమే కాదు విప్లవకారుల‌ను కూడా కాల్చ‌ద‌లుచుకున్నది. రోహిత్‌ వేముల‌, అంబేడ్కర్‌ అసోసియేషన్‌ మొదలు కన్హయ్య కుమార్‌ వంటి ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకుడు, ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ వంటి విప్లవ విద్యార్థులు దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్‌గా, టెరరిస్టులుగా కనిపిస్తున్న సంఘ్‌ప‌రివార్‌కు భగత్‌సింగ్‌ను విప్లవ టెరరిస్టు అనడం అభ్యంతరకరం కావడం అవకాశవాదం తప్ప మరేమీ కాదు. ముస్లింగా పుట్టడమే టెరరిజంగా, మావోయిజం అంటే దేశద్రోహంగా చిత్రిస్తున్న హిందుత్వ శక్తుల‌కు మావోయిస్టుల‌కు వేగుచుక్క అయిన భగత్‌సింగ్‌ మీద ప్రేమ కల‌గడానికి మించిన ద్వంద్వనీతి మరేముంటుంది?
(13.5.2016న సాక్షిలో ప్రచురితమైన వ్యాసానికి పూర్తి పాఠం)
http://virasam.org/article.php?page=65
http://www.sakshi.com/news/editorial/history-of-discussion-on-bhagat-singh-338366?pfrom=inside-latest-news

No comments:

Post a Comment