Tuesday 12 May 2020

వారికి సలాం!!!!! Iqbal Chand 8 May 2020

వారికి సలాం!!!!!
------------------------------
పర్సనల్ గా నాకు తెలుగు సాహిత్యంలోని మైనారిటీ సాహిత్యం పై సదభిప్రాయం లేదు.

ఇది అందరికి తెలిసిన విషయమే.దానికి రెండు ముఖ్య కారణాలు.

1.క్వాలిటీ లేకపోవడం
2.ఎవరి కోసం రాస్తున్నారో వారికి తెలవకపోవడం, చేరకపోవడం, లేదా వీరు చెప్పే వాదం సగటు ముస్లింలు ఆమోదించకపోవడం.

ఆ కేటగిరి కవులందరినీ ఒకే గాటన కట్టడంలేదు.

దళిత కవులను దళితులు ఓన్ చేసుకొన్నారు, బీ.సీ కవులను బీ.సీలు పట్టం కట్టారు. కానీ ,ముస్లిం కవులు సగటు ముస్లిం సమాజాన్ని ఆకర్షించలేకపోయారు.

కొంతమంది విమర్శకుల మాయలో పడి ఈవెంట్ మేనేజర్లు మైనారిటీ కవుల రూపం ఎత్తారు.ఇది మరీ దురదృష్టం.

ఇది ముమ్మాటికి నిజం.

మైనారిటీ సాహిత్యం పై ఎటువంటి భ్రమలు వారికి లేవు.పైగా వీరిపై ఎటువంటి సానుభూతి ,సహాయానుభూతి కూడా ముస్లింల నుండి లభించలేదు.

ఎందుకంటే సాహితీ స్పృహ ఉన్నవారు వీరి కవిత్వాన్ని చదివాక పెదవి విరుస్తారు.

వారికి బాల్యం నుంచి అల్లామా ఇక్బాల్, గాలిబ్ ,సాహిర్, ఫైజ్ అహమద్ ఫైజ్ వంటి మహా కవులని చదివాక వీరి కవిత్వం లోని డొల్ల తనం బయట పడుతుంది.

ఇక ఉర్దూ రాని వారి కోసం ఇది.

తెలుగు లో కూడా పెద్ద ప్రభావం చూపే కవులు ఎక్కువ లేకపోవడం పెద్దలోటు.

అఫ్సర్ అంతర్జాతీయ వేదిక మీద తెలుగు కవిత్వానికీ ,కథకు, విమర్శ కు ఒక జెండా లా ఎగురుతున్నాడు.

అలాగే గత 20 ఏళ్ళ నుంచి అఫ్సర్ రాసిన మైనారిటి సాహిత్యానికి ఒక లెగసీ ఉంది.

ఎకడమిక్ డిసిప్లైన్ తో కూడిన స్టాండర్డ్స్ తో పాటు సగటు ముస్లిం జీవన విధానానికి చక్కటి రూపం కూడా అఫ్సర్ సాహిత్యానికి ఆకర్షణ.

మిగతావారిలో చాలామందిలో ఈ క్వాలిటీ లేకపోవడం తో ఒట్టి నినాదాలకు లెదా సెన్సేషన్స్ వరకే పరిమితి అయ్యారు.

అటు ముస్లిం వర్గానికి దగ్గర కాలేక ఇటు రెగ్యులర్ స్రవంతి కి దూరమై రెంటికి చెడ్డ రేవడిగా మిగిలారు.

ఇక ఇటీవలి కరోనా నేపథ్యంలో అఫ్సర్ గ్లొబల్ లెవల్లో తన ప్రాతినిథ్యం బలంగా వినిపించి ఒక దీపంలా వెలుగు చూపుతున్నాడు.

యాకూబ్ ను మైనారిటి కోణం లో చూడలేము.యాకూబ్ కవిత్వం వాదవివాదాల స్థాయిని దాటి మానవ సంబంధాలతో ముడిపడివుంది.కాబట్టి యాకూబ్ ని ఈ వరసలో చూడకూడదు.యాకూబ్ ది విశ్వమానవ గీతం.

ఇటీవలి కాలం లో తన ప్రకటనలతో ముస్లిం సమాజానికి మరీ దెగ్గరా చేరినవారు వాహెద్,నశ్రీన్లు,

లాక్డౌన్ ను సమర్థించినవాడు వాహెద్.

అలాగే తబ్లిక్ వాళ్ళు తన ఇజ్తెమాను పోస్ట్పోన్ చేసుకొనిఉండాలి అని మొదటిసారిగా అన్నవాడు కూడా వాహెద్.డ్యాని కూడా తనవంతు కి మించి ఈ విషయంలో పని చేసారు.

అలాగే రంజాన్ నెలలో ముస్లిం కుటూంబాలు చాలా డబ్బులు వృధాగా ఖర్చుపెడతారు.అటువంటీ ఖర్చులను వదులుకొని సాదాసీదాగా పండగ జరుపుకొందాం అని ధైర్యం గా ముందుకు వొచ్చి ప్రకటించిన కవయిత్రి నశ్రీన్.వాహెద్ , నశ్రీన్ ల మాటల ప్రభావం ముస్లిం సమాజానికి చేరింది.

ఇప్పుడు వారు చెప్పినట్లు ఆలోచించడమే కాదు ఆచరిస్తున్నారు.

నాకు నచ్చిన మరో గొంతు షాజహన మంచి భావుకురాలు, మoచి క్వాలిటీ కవిత్వం రాస్తుంది. అకడమిక్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి.

సాబిర్ కూడా మంచి కవిత్వం రాస్తున్నారు.త్వరలో నశ్రీన్,వాహెద్ ల రచనల్లా వారి రచనలూ ముస్లిం
సమాజానికి దెగ్గర అయితే నాకు చాలా సంతోషం.

రసూల్ ఖాన్, డాక్టర్ షేక్ ఇబ్రాహీ,సలీమా,ఫైజ్, షేక్ పీర్ల మహమూద్, నబి ఖరీం ఖాన్, హనీఫ్, పీర్ల మొహమ్మద్,ఉస్మాన్ ఖన్ , లు కూడా బలంగా వారి గొంతులు సవరిస్తున్నారు.

వినుకొండ కరీముల్లా గురించి విన్నాను కానీ , నేను చదవలేదు.చదివాక స్పందిస్తాను.

రాజా హుస్సైన్ భాయి ఒక్కరే అలసిపోకుండా సాహిత్య విమర్శ రాసుకుంటూ పోతున్నారు.అభినందనలు.

ఏది ఏమైన ఈ కరోనా కాలంలో అఫ్సర్,నశ్రీన్,డ్యానీ, వాహెద్ ల కృషి ఎంతో ప్రశంసనీయం.

మిగిలిన వారికి ఆదర్శంగా వీళ్ళు నిలిచారు.

ఇది నిజమైన ప్రాతినిథ్యం.
సరైన సమయంలో ఎలా స్పందించాలో వారు రుజువు చేసారు.మరీ ముఖ్యంగా వాహెద్, డ్యానీ, నశ్రీన్ ల అయిడియాలజి చాలా బలం గా వుంది. ఎవరినీ విమర్శించడంలేదు.

సంస్కరిచుకొనే మార్గాన్ని వీరు చూపుతున్నారు.
భారతీయ జీవన విధానంలో ముస్లింలు కూడా ఒక భాగమే.
ఇప్పుడు తప్పొప్పులు వెతుక్కొనే సమయం కాదు.

తిట్ల పురాణాలకు అసలే కాలం కాదు.మన తప్పులోంచి పాఠాలూ నేర్చుకొనే సమయం ఇది.

రాజకీయాలకు అతీతంగా మిగిలిన సమూహాలతో కలిసిమెలిసి బతకాల్సిన వాళ్ళు.ఇది ఆడంబరాల కాలం కాదు.

ఈ సామాజిక మార్పు లో కవులు రచయితలు మిగిలిన వారి కంటే ముందు చూపు కలిగి ఆదరంగా నిలిస్తే చాలా సంతోషం.

చరిత్ర రచన లో సయ్యిద్ నసీర్ ఆహమద్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.నజీర్ శ్రమ ఎంతో విలువైనది.వంద మంది కవులు చేయలేని పనిని ఒక్క నజీర్ చేస్తున్నాడు.

తెలుగు నాట సామాన్య ముస్లిం ప్రజా జీవనానికి దిక్సూచికలుగా వాహెద్ , నశ్రీన్ లు ఉన్నారు.వారికి అభినందనలు.

రమజన్ అయ్యేవరకూ లాక్డౌన్ కొనసాగించాలి.ముస్లిం సమాజం వల్ల కరోనా పెరిగిందనే అపవాదు రాకుండా ఉండాలంటే మీ సహకారం చాలా అవసరం.అంతా బావుంటే భవిష్యత్తులో మరిన్ని పండుగలు చేసుకోవొచ్చు.దూరం పాటించండి.ఇంటిలోనే గడపండి.కొందరివల్ల అందరికీ ఇబ్బంది పడే అవకాశం ఇవ్వొద్దు.సాదా సీదా జీవితాన్నే ఇస్లాం అభిలాషిస్తుంది.

ఇది గత రెండు దశాబ్దాల కు పరిమితమైనది గా భావించ మనవి. అంతకు ముందు కవిత్వం రాసిన ఉమర్ అలి షా, ఇస్మాయీల్,వజీర్ రహమాన్, ఖాదర్ మొహియొద్దీన్ ,గౌస్ ,కౌముది , దేవి ప్రియ, సుగం బాబు గార్లను మినహాయించాను.వారు పూర్వ కవులని
నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా 2000 తర్వాత వొచ్చిన కవిత్వాన్నే పరిగణన లోకి తీసుకొన్నాను.కొందరు మంచి కవులను మరిచిపోయి ఉండవొచ్చు.కానీ ఉద్దెశపూర్వకంగా వారిని వదలలేదని మనవి.

No comments:

Post a Comment